శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (14:24 IST)

మాజీ ప్రియుడితో కలిసి నటించేందుకు నో అబ్జెక్షన్ : రష్మిక మందన్నా

తన మాజీ ప్రియుడు, కన్నడ హీరో రక్షిత్ శెట్టితో కలిసి నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా చెప్పుకొచ్చింది. 
 
నిజానికి ఈ ముద్దుగుమ్మ కిరాక్ పార్టీ అనే చిత్రంతో వెండితెర ప్రవేశం చేసింది. అదేసమయంలో ఈ అమ్మడు హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలోపడింది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుని, నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. 
 
కానీ, కొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సిన సమయంలో ఏం జరిగిందో తెలియదుగానీ,  ఇద్దరూ బ్రేకప్ అయ్యారు. ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా... ఎవరి పనుల్లో వారు పడిపోయారు.
 
అదేసమయంలో రష్మిక మందన్నా తెలుగులో అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ ముందుకుసాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో 'కిరాక్ పార్టీ' సినిమాకు సీక్వెల్ తీసేందుకు రక్షిత్ శెట్టి రెడీ అయ్యాడు. వేరే హీరోయిన్‌ను తీసుకోవాలని రక్షిత్ భావిస్తున్నాడు. అయితే నిర్మాతలు మాత్రం రష్మిక అయితేనే బాగుంటుందనే భావనలో ఉన్నారట. 
 
ఈ విషయం రష్మికకు తెలియడంతో... రక్షిత్ తో కలిసి నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిందట. దీంతో, రష్మికతో కలిసి పని చేసేందుకు రక్షిత్ ను ఒప్పించే పనిలో నిర్మాతలు పడ్డారట. మరి... తన మాజీ లవర్ తో కలిసి నటించేందుకు రక్షిత్ ఒప్పుకుంటాడో? లేదో? వేచి చూడాలి.