తండ్రికి కాజల్ ... తనయుడుకి రష్మిక (Video)

rashmika mandanna
ఠాగూర్| Last Updated: శనివారం, 5 డిశెంబరు 2020 (15:35 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు, హీరో రాంచరణ్ నిర్మిస్తున్నారు. పైగా, ఈ చిత్రంలో చెర్రీ విద్యార్థి సంఘ నేతగా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అతనికి జోడీగా కుర్ర హీరోయిన్ రష్మిక మందన్నాను ఎంపిక చేసినట్టు సమాచారం. అలాగే, చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే.

ముఖ్యంగా, ఈ చిత్ర కథానుసారం చెర్రీ కనిపించేది కొద్ది సమయమే అయినప్పటికీ.. ఆ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందట. అందుకే ఆయన సరసన తొలుత బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ పేరును పరిశీలించారు.

కానీ, ఆమె ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటం వల్ల ఈ చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయింది. అందుకే రష్మికను సంప్రదించినట్టు సమాచారం. కాగా, రష్మిక నటించే పాత్రకు సంబంధించిన షూటింగ్ వచ్చే యేడాది మార్చిలో జరుగనుందట.


దీనిపై మరింత చదవండి :