బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2024 (15:29 IST)

ధనుష్ తో సినిమా కోసం వేచి చూస్తున్నాను.. రష్మిక మందన్న

Rashmika Mandanna
అగ్ర హీరోయిన్ రష్మిక మందన్న యానిమల్ చిత్రం విజయంతో దూసుకుపోతుండగా, ఆమె తన తదుపరి చిత్రం కోసం ధనుష్‌తో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ లో నాగార్జున అక్కినేని కూడా ప్రధాన పాత్రలో నటించనుంది.

ధనుష్ సర్‌తో కలిసి పనిచేయాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే ధనుష్ అద్భుతమైన నటుడు. ధనుష్ తో సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. ధనుష్ 51 కోసం సిద్ధంగా వున్నానని.. పుష్ప 2లోనూ నటిస్తున్నానని రష్మిక వెల్లడించింది. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప: ది రైజ్ 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌తో యాక్షన్ డ్రామా సాగుతుంది.  

తాజాగా పుష్ప2లో ఓ సాంగ్ షూట్ ను కంప్లీట్ చేశాను. సాంగ్ అద్భుతంగా వచ్చింది. ఇది ముగింపులేని కథ. ఈ చిత్రం ఎంతో ఆనందాన్ని పంచుతుంది. మంచి సినిమాను అందించేందుకు డైరెక్టర్ సుకుమార్ సార్ ఎంతగానో కష్టపడుతున్నారు. పుష్ప2లో నాపాత్ర మరింత ఆకట్టుకునేలా ఉంటుందని రష్మిక వెల్లడించింది. ఈ చిత్రాన్ని 2024 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని మేకర్స్ ప్రకటించారు.