ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (23:21 IST)

సమంతకు అమ్మలా మారుతా... వండర్ ఫుల్ వుమెన్.. (video)

Samantha
స్టార్ హీరోయిన్ సమంత గురించి పుష్ప స్టార్ రష్మిక మందన ప్రశంసల వర్షం కురిపించింది. హీరోయిన్ సమంత గురించి రష్మిక పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ఆకాశానికెత్తేసింది. సమంత వ్యాధి గురించి తనకు తెలియదని పేర్కొంది. వారిసు సినిమా ప్రమోషన్ లో భాగంగా రష్మిక మాట్లాడుతూ.. సమంత వండర్ ఫుల్ లేడీ అంటూ కొనియాడింది. 
 
చాలామంది అమ్మాయి. ఆమె విషయంలో ఒక అమ్మలా తనకు రక్షణ కల్పించాలనుకుంటానని రష్మిక చెప్పింది. సమంత తన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించేవరకు విషయం తనకు తెలియదని.. మయోసైటిస్ తో బాధపడుతున్నట్లు ఏనాడూ చెప్పలేదని.. ఏదేమైనా ఆమెకు అంతా మంచే జరుగుతుందని తెలిపింది. 
 
జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న సమంత నుంచి అందరిలా స్ఫూర్తి పొందానని చెప్పుకొచ్చింది. కాగా పుష్పలో రష్మిక హీరోయిన్ గా నటించగా, సమంత ఐటమ్ గర్ల్ గా ఒక పాటకు స్టెప్పులేసిన సంగతి తెలిసిందే.