గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (09:22 IST)

"కేజీఎఫ్-3" కోసం ఎదురు చూస్తున్నాను.. రవీనా టాండన్

raveena tandon
బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్ ఒకప్పుడు గ్లామర్ గర్ల్. బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్‌ సినిమాల్లో కనిపించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అదరగొట్టింది. ఇంకా అవార్డులు గెలుచుకుంది. భారత ప్రభుత్వం ఇటీవలే రవీనా టాండన్‌కి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.
 
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, 48 ఏళ్ల నటి తాను "కేజీఎఫ్-3" కోసం ఎదురు చూస్తున్నానని రవీనా టాండన్ పేర్కొంది. "కేజీఎఫ్-2"లో ఆమె దివంగత ఇందిరా గాంధీ మోడల్‌గా భారత ప్రధానిగా నటించింది. 
 
సినిమాలోని ప్రతి నిమిషం తనకు నచ్చిందని, పార్ట్-3 కోసం సెట్‌కి తిరిగి రావడానికి వేచి ఉండలేనని చెప్పింది. కేజీఎఫ్ పార్ట్ 3ని దర్శకుడు ప్రశాంత్ నీల్‍‌తో పాటు నిర్మాతలు ప్రకటించారు.