గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2023 (13:05 IST)

'ధమాకా' దూడుకు... రూ.100 కోట్ల క్లబ్‌లో రవితేజ చిత్రం

dhamaka
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. గత నెల 23వ తేదీన విడుదైన చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటివరకు 14 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రూ.వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. 
 
ముఖ్యంగా, ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజునే రూ.10 కోట్ల మేరకు కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచిన ధమాకా... ఆ తర్వాత చాల వేగంగా రూ.90 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత కలెక్షన్లు కాస్త మందగించాయి. ఈ క్రమంలో 14 రోజులు పూర్తి చేసుకునేసరికి ఈ చిత్రం ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరింది.
 
ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా తెలియజేస్తూ తాజాగా ఓ పోస్టరును రిలీజ్ చేసింది. ఇది రవితేజ మార్కు సినిమా... ఆయన బాడీ లాంగ్వేజ్‌కి తగిన కథ. ఆయన నుంచి ఆడియన్స్ కోరుకునే తరహాలోనే పాటలు, మాటలు, డ్యాన్సులు, ఫైట్స్, డైలాగులు ఉన్నాయి. పైగా, గత 14 రోజులుగా ఈ చిత్రానికి మరేచిత్రం పోటీ లేకపోవడంతో అతి తక్కువ కాలంలోనే భారీ కలెక్షన్లు రాబట్టింది.