సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (19:06 IST)

సర్కారు వారి పాటలో నేనా..? రేణు దేశాయ్ ఏం చెప్పారు..? (video)

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య, నటి రేణు దేశాయ్‌కు కరోనా పాజిటివ్‌ అంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రేణు ఇదంతా ఉట్టి పుకార్లేనని, తనపై ఎలాంటి వార్తలు వచ్చిన నమ్మద్దని చెప్పారు. ఒకవేళ ఏదైనా ఉంటే తానే స్పష్టం చేస్తానన్నారు. ఈ క్రమంలో ఆమె మహేష్‌ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’లో నటిస్తున్నట్లు కూడా వస్తున్న వార్తలపై స్పందించారు. 
 
ఈ సినిమాలో ఆమె మహేష్‌కు వదినగా నటిస్తున్నట్లు కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల లైవ్‌ చాట్‌లో పాల్గొన్న రేణు ‘సర్కారు వారి పాట’ సినిమాలో తను నటించడం లేదని స్పష్టం చేశారు. ఈ వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఒకవేళ నేను నటిస్తే ఆ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తాను’ అంటూ ఆమె చెప్పకొచ్చారు.
 
ఇక తెలుగులో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించినా రేణు ఇప్పటికే ఓ చిత్రాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. అంతేగాక మరో రెండు సినిమాల కథలు విన్నానని, వాటిని ఖరారు చేయాల్సి ఉందని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. దీనితో పాటు రైతుల సమస్యలపై ఓ సినిమాను నిర్మించేందుకు కూడా అన్నీ సిద్ధం చేసుకుంటున్నట్లు వివరించారు.