సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (16:15 IST)

వకీల్ సాబ్‌లో నేనా? దయచేసి ఇలాంటి రూమర్లకు చెక్ పెట్టండి?

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ''వకీల్ సాబ్'' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం బాలీవుడ్ 'పింక్'కు రిమేక్. ఈ చిత్రంలో పవన్‌తో పాటు ఓ కీలక పాత్రలో రేణు దేశాయ్ నటిస్తుందని గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ వార్తలపై సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటున్న రేణుదేశాయ్ స్పందిస్తూ కొట్టిపారేశారు. వకీల్ సాబ్‌లో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు పచ్చి అబద్ధం అన్నారు. ఎవరో రూమర్లు స్టార్ట్‌ చేస్తారు.. అసలు రూమర్లు స్టార్ట్‌ చేసే ఇంత సమయం వారికి ఎలా ఉంటుందని ప్రశ్నించింది. 
 
ఇలాంటి వారి తీరును చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పారు. దయచేసి ఇలాంటి రూమర్లకు చెక్ పెట్టండి.. ప్రస్తుతం కరోనా విజృంభనను కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయండని రేణు దేశాయ్ పిలుపు నిచ్చారు. ఇంట్లో పెద్ద వారిని బాగా చూసుకోవాలని రేణూ దేశాయ్ సూచించింది. తన కూతురు ఆధ్యా స్కేటింగ్‌, పెయింటింగ్‌, డ్రాయింగ్‌, శాండ్‌విచ్‌ కుకింగ్‌ బాగా చేస్తుందని ఆమె తెలిపింది.