గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (13:53 IST)

బిగ్‌బాస్-3 హోస్ట్‌గా అనుష్క... కంటెస్టెంట్‌గా రేణూదేశాయ్.. రష్మీ, సుధీర్?

బిగ్‌బాస్-3 త్వరలో ప్రారంభం కానుంది. ఈ రియాల్టీ షో హోస్ట్‌గా ఈ సారి వెరైటీగా అనుష్క పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే స్టార్ మా యాజమాన్యం.. బిగ్‌బాస్‌ను ఓ మహిళ ఎందుకు హోస్ట్ చేయకూడదనే ఆలోచన పడిందట.


అనుష్క.. బిగ్ బాస్-3 హోస్ట్‌గా వ్యవహించేందకు స్టార్ మా, నాగార్జున సహకారం తీసుకున్నట్టు సమాచారం. నాగార్జున సలహాతోనే అనుష్క.. బిగ్‌బాస్-3ను హోస్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
 
ఈ నేపథ్యంలో మరోవైపు బిగ్ బాస్-3లో పాల్గొనేదెవరనే అంశంపైనా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ షోలో వీళ్లు ఉండొచ్చంటూ కొన్ని పేర్లుసోషల్ మీడియాలో షికార్లు కొడుతున్నాయి. అటాంటి వారిలో సుడిగాలి సుధీర్, రేష్మి ముందువరుసలో ఉన్నారు. ఇంకా... టీవీ నటి హరిత, వరుణ్ సందేశ్, యాంకర్ ఉదయభాను, సింగర్ హేమచంద్ర ఉన్నారు. 
 
వీరు దాదాపుగా ఫైనల్ అయ్యారట. వీరితో పాటు జబర్దస్త్ పొట్టి నరేష్, టివి ఆర్టిస్ట్ జాకీ, నటుడు కమల్ కామరాజు, రేణు దేశాయ్, గుత్తా జ్వాల, మనోజ్ నందన్, రఘు మాస్టర్, నాగ పద్మిణి, యాంకర్ ప్రదీప్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.