నా భర్త బంగారం... ఆయన గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు : రేణు

గురువారం, 5 అక్టోబరు 2017 (17:05 IST)

Renu Desai

తనపై తాజాగా వస్తున్న కామెంట్లపై పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తన ఫేస్బుక్ ఖాతాలో తాజాగా మరో పోస్టు పెట్టారు. "నిన్న నేను పెట్టిన పోస్టులో నా మాజీ భర్త అభిమానుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీడియా, కొందరు వ్యక్తులు కలసి కల్యాణ్ అభిమానులకు, నాకూ మధ్య ఇష్యూ తెస్తున్నారు. నేను చాలా క్లియర్గా రాశాను. ఈ పోస్టు నా పర్సనల్ ఇష్యూ గురించి కాదు. దేశ పౌరురాలిగా నా ఆలోచనను నేను పంచుకున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
పైగా, ఈ సమయంలో మీ అందరికీ ఒకటే విన్నపం. మహిళలకు స్వేచ్ఛ, విద్య, ఆరోగ్యం గురించి ఆలోచించుకోండి. మీ అందరికీ అమ్మ, అక్క, చెల్లి ఉన్నారు. ఇది నా కోసం కాదు. వాళ్ల కోసం చేయండి. వారికి చదువుకునేటప్పుడు, పని చేసేటప్పుడు రక్షణ ఉందన్న భావన కలిగించండి. భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించండి. మీడియా చానల్స్ తమ పవర్ చూపిస్తూ, టీవీల్లో డ్రామాలు, అపార్థాలు కలిగించే కథనాలను ప్రస్తావించవద్దు. అందరూ తమతమ కుటుంబాలు, ఇళ్లల్లోని మహిళల కోసం ఒకటిగా కదలాలన్నదే నా అభిమతం. కృతజ్ఞతలు" అంటూ తన పోస్ట్‌లో పేర్కొంది.  
 
కాగా, హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కు పెద్ద చిక్కు వచ్చిపడింది. రెండో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన తన మదిలో వచ్చిందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలే ఈ చిక్కుకు ప్రధాన కారణంగా ఉన్నాయి. ఆమె మదిలో మెదిలిన ఈ ఆలోచనపై పలువురు మండిపడుతున్నారు. ఆమె సోషల్ మీడియా టైమ్ లైన్‌పై కామెంట్ల వరద కొనసాగుతూనే ఉంది. 
 
తాజాగా పవన్ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పవన్ పిల్లలకు తల్లిగా బాధ్యత లేదా? అకీరా, ఆరాధ్యలను ఏం చేస్తావు? పవన్ అన్న నుంచి మీరు విడాకులు తీసుకుని ఉండొచ్చు. కానీ పవన్ పిల్లలకు దూరం కాలేదుగా? మీ కొత్త భర్త పిల్లలను చేరదీయకుంటే..? మీ జంటకు పిల్లలు పుడితే, అకీరా, ఆరాధ్య సంగతేంటి? అని ప్రశ్నిస్తున్నారు.
 
ఇంకొందరు మరో అడుగు ముందుకేసి, మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని, పవన్ కల్యాణ్ లేకుంటే అసలు రేణు దేశాయ్ అన్న పేరే బయటకు వచ్చుండేది కాదని, ఇకపై 'వదినగారూ' అని పిలవబోమని కామెంట్లు పెడుతున్నారు. ఇకపై ఇంటర్వ్యూల్లో పవన్ కల్యాణ్ పేరును కూడా ప్రస్తావించవద్దని హెచ్చరిస్తున్న కామెంట్లూ వస్తున్నాయి. మరొక అభిమాని అయితే.. వదినమ్మా.. నీవు పెళ్లి చేసుకుంటే నేను చచ్చినంత ఒట్టు అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అందరికీ అమ్మ, అక్క, చెల్లి ఉంటారు కదా : రేణూ దేశాయ్

హీరో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఓ సందర్భం గురించి ప్రస్తావిస్తూ తోడుంటే బాగుండు ...

news

వదినమ్మా.. నీవు పెళ్లి చేసుకుంటే నేను చచ్చినంత ఒట్టు..

హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కు పెద్ద చిక్కు వచ్చిపడింది. రెండో పెళ్లి ...

news

నాగార్జునతో వర్మ సంచలన మూవీ...

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీసేందుకు సిద్ధమవుతున్నారు. ...

news

పవన్ కళ్యాణ్‌ చదివింది ఇంతేనా...

తెలుగు సినిమా హీరోలను కొంతమంది అభిమానులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. హీరోల గురించి వారి ...