దర్శకత్వం వహించనున్న రేణూ దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ త్వరలోనే ఓ ఇంటికి కోడలు కానుంది. పవన్‌తో సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా పవన్ - రేణూ విడ

pnr| Last Updated: శుక్రవారం, 10 ఆగస్టు 2018 (14:53 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ త్వరలోనే ఓ ఇంటికి కోడలు కానుంది. పవన్‌తో సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయింది.  ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా పవన్ - రేణూ విడిపోయారు.
 
ఈ నేపథ్యంలో రేణూ దేశాయ్ త్వరలోనే రెండో పెళ్ళి చేసుకోనుంది. ఇందుకోసం నిశ్చితార్థ ఘట్టం కూడా పూర్తయింది. అలా కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న రేణూ దేశాయ్.. ఇపుడు ఓ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించనుందట. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. స్క్రిప్ట్ పని పూర్తైందని, త్వరలోనే సినిమాను మొదలుపెడతామని అన్నారట.  
 
ఈ సినిమా కథ కూడా రైతుల సమస్యల చుట్టూ తిరిగేలా ఆమె తయారు చేసినట్టు తెలుస్తోంది. అందుకే ఆమె కొంతమంది రైతుల్ని కలిసి వారి బాధల్ని నేరుగా తెలుసుకోనున్నారట. అంతేకాదు ఈ చిత్రాన్ని స్వయంగా ఆమే నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రంలో నటీనటులెవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, రేణూ దేశాయ్ గతంలో 'ఇష్క్ వాలా లవ్' అనే మరాఠీ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. దీనిపై మరింత చదవండి :