శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2017 (06:47 IST)

సాహోరే బాహుబ‌లి రేవంత్ రెడ్డి అంటోన్న రామ్ గోపాల్ వర్మ.. ఫోటో

తెలంగాణలో రాజకీయాలను హీటెక్కించి తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ‌లో చేరడం త

తెలంగాణలో రాజకీయాలను హీటెక్కించి తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ‌లో చేరడం త‌న‌కు చాలా చాలా హ్యాపీ అని పేర్కొన్న వర్మ... రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ద్వారా తనకు ఆ పార్టీపై పూర్తి నమ్మకం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి బాహుబలి అని, బాహుబలి బాక్సాఫీస్‌కి నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కి ఓట్ల వర్షం కురిపిస్తాడని కొనియాడాడు. 
 
అలాగే తన పోస్టులో బాహుబ‌లి గెట‌ప్‌లో రేవంత్ రెడ్డిని చూపించారు. "సాహోరే బాహుబ‌లి రేవంత్ రెడ్డి" అంటూ రేవంత్ బాహుబలి గెటప్‌లో వున్న ఫోటోను చూపించారు. ఈ పోస్ట్ పై స్పందిస్తోన్న నెటిజ‌న్లు వ‌ర్మ క్రియేటివిటీని కాపీ కొట్టి త‌మ‌కు ఇష్ట‌మైన హీరోలని బాహుబ‌లిలా రూపొందించి కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను మీరూ ఓ లుక్కేయండి.