థియేటర్లో క్రాకర్స్ పేల్చిన వారికి పిచ్చి పట్టిందా? ఆర్జీవీ
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం ఆదివారం విడుదలైంది. దీంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అయితే ఓ థియేటర్‌లో అభిమానుల ఉత్సాహం హద్దులు దాటింది.
థియేటర్‌లో ఏకంగా క్రాకర్స్ కాల్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది. థియేటర్‌లో బాణాసంచా కాల్చడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అకా ఆర్జీవీ కూడా స్పందించారు. థియేటర్లో క్రాకర్స్ కాల్చిన వారికి పరోక్షంగా పిచ్చి పట్టిందని అన్నారు.
థియేటర్లో క్రాకర్లు పేలడంపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అభిమానం పేరుతో ఇతర ప్రేక్షకులను వేధించడం సరికాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.