శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (12:14 IST)

ఆర్జీవీతో సందీప్ వంగా స్క్రిప్ట్ చర్చించాడట.. రణబీర్ బాత్రూమ్‌కి వెళ్లాడట!

Animal
Animal
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌తో సందీప్ రెడ్డి వంగ "యానిమల్" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కథ విషయంలో రామ్ గోపాల్ వర్మ హెల్ప్ చేసారని సమాచారం. విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి అనే ట్రెండ్ సెట్టర్ సినిమా తీసి భారతీయ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. 
 
ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోలు సందీప్‌తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపారు. ఈ సినిమా యానిమల్ షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 
 
జనవరిలో విడుదలైన యానిమల్ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. రణబీర్ కపూర్ లుక్ అందరినీ షాక్‌కి గురి చేసింది. దీనిపై రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ''గ్యాంగ్‌స్టర్‌ సినిమాలన్నింటిలోకి యానిమల్‌ సినిమా సూపర్‌. సందీప్ నాతో కథ చర్చించాడు.. అంటూ తెలిపాడు. 
 
ఇప్పటికే ఈ సినిమాపై మంచి హైప్ ఉండగా, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలతో మరింత ఆసక్తి నెలకొంది. సందీప్ స్క్రిప్ట్‌ను రణబీర్ కపూర్‌కి చెప్పినప్పుడు, అతను భయపడ్డాడని సమాచారం.
 
ఈ విషయాన్ని రణబీర్ కపూర్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. "నేను మొదటిసారిగా యానిమల్ స్క్రిప్ట్ విన్నప్పుడు. నాకు ఇంకా గుర్తుంది.. దర్శకుడు సందీప్ స్క్రిప్ట్ చెప్పడం పూర్తి కాగానే నేను నా బాత్రూమ్‌కి వెళ్లాను. అద్దంలో నన్ను నేను చూసుకున్నాను. నేను చాలా భయపడ్డాను. కథకు, పాత్రకు భయపడడం ఇదే తొలిసారి. సందీప్‌తో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఇది క్రూరమైన గ్యాంగ్‌స్టర్ డ్రామా. తండ్రీ కొడుకుల ప్రేమకథ" అన్నారు.