శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (11:55 IST)

వివాదాల డైరెక్టర్ నోటి వెంట వింత మాట... జై చంద్రబాబు

టాలీవుడ్‌లో వివాదాస్పద డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఈ సినిమాను విడుదల చేయడానికి ఏ మాత్రం వెనుకాడకుండా ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఆర్జీవీ. 
 
ఈ సినిమాలో సన్నివేశాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నందున ఇప్పటికే ఈ సినిమాను ఆపివేయాలంటూ పలువురు టీడీపీ కార్యకర్తలు కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో ఆర్జీవీ చంద్రబాబును ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.
 
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలపై నాకు 100 పర్సెంట్ నమ్మకం ఉండటానికి కారణం చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా అధికార దుర్వినియోగం జరగకుండా, లా అండ్ ఆర్డర్‌కు రౌడీ ఎలిమెంట్స్ ఇబ్బంది కలిగించకుండా నిరోధిస్తారని అనుకుంటున్నాను. జై చంద్రబాబు, జై ఎన్టీఆర్...అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. 
 
ఈ సినిమాను 29న రిలీజ్ చేస్తామని ప్రకటించగా ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో దీని విడుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆర్జీవీ వరుసలు మీడియా ఛానెల్ల ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్నారు. ఇక వెన్నుపోటు నేపథ్యంలో తీసిన ఈ సినిమా విడుదల అనుకున్న తేదీన ఉంటుందో లేదో మరి.