సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (16:37 IST)

యాంకర్ శ్యామలపై కన్నేసిన ఆర్జీవీ.. ఇంత అందం నా కంట పడలేదే!

RGV
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌ ఆర్జీవీ. అమ్మాయిల్ని ఎప్పుడూ పొగుడుతూ ఉండే ఆర్జీవీ కన్ను ప్రస్తుతం ఓ యాంకర్‌పై పడింది. పుష్ప‌ సినిమాలో జాలిరెడ్డి గా నెగెటివ్ రోల్ కనిపించిన కన్నడ హీరో ధ‌నుంజ‌య్ తన ‘బ‌డ‌వ రాస్కెల్‌’ సినిమాను తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. 
 
ఫిబ్రవరి 18న ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ఆర్జీవీ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ ఈవెంట్ ని యాంకర్ శ్యామల హోస్ట్ చేసింది. దీంతో ఆర్జీవీ ఈ ప్రోగ్రాం హోస్ట్ చేస్తున్న యాంకర్ శ్యామలపై కామెంట్స్ చేశారు. 
 
ఆర్జీవీ మైక్ తీసుకోగానే యాంకర్ శ్యామలని ఉద్దేశించి.. "అసలు ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ళలోంచి ఇన్నాళ్లు ఎలా తప్పించుకున్నారు" అంటూ కామెంట్ చేశారు. దీంతో శ్యామల ఆశ్చర్యపోయింది. అలాగే యాంకర్ శ్యామల ఆర్జీవీ వచ్చినప్పుడు తోపు, రౌడీ, గుండా.. అనే పదాలని వాడుతూ పొగిడింది. 
 
దానికి కూడా ఆర్జీవీ సమాధానమిస్తూ.. "నువ్వు నన్ను తోపు, రౌడీ ఇలా అన్నావు వాటితో పాటు నేను రాస్కెల్ కూడా" అంటూ తనపైనే సెటైర్ వేసుకున్నారు ఆర్జీవీ. దీంతో యాంకర్ శ్యామలపై ఆర్జీవీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.