శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 1 జనవరి 2018 (13:14 IST)

రజనీకాంత్ పార్టీ పెడితే పవన్‌ను ఏకేశారు.. ఎవరో తెలుసా? వర్మ-కత్తి

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై నెటిజన్లు పలురకాల కామెంట్లు పోస్టులు చేస్తున్నారు. మీమ్స్, సెటైర్లు కూడా నెట్టింట పేలుతున్నాయి. త‌మదైన శైలిలో కామెంట్లు, ట్వీట్లు పెట్టి ర‌జ‌నీ రాజకీయ అరంగేట్ర

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై నెటిజన్లు పలురకాల కామెంట్లు పోస్టులు చేస్తున్నారు. మీమ్స్, సెటైర్లు కూడా నెట్టింట పేలుతున్నాయి.  త‌మదైన శైలిలో కామెంట్లు, ట్వీట్లు పెట్టి ర‌జ‌నీ రాజకీయ అరంగేట్రాన్ని నెటిజన్లు ట్రెండింగ్ చేస్తున్నారు. వాటిలో కొన్ని ట్వీట్లు విప‌రీతంగా ఆక‌ట్టుకుని, న‌వ్వుతెప్పిస్తున్నాయి. 
 
అందులో శివాజీ సినిమాను నిజ జీవితంలో చూసే ఛాన్స్ త్వరలోనే రానుందని కొందరంటే.. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం వార్త విని.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  బ్యాంకాక్ పారిపోయాడని మరికొందరు అంటున్నారు. 
 
ర‌జ‌నీ వ‌చ్చేస్తున్నాడు... మిగ‌తా రాజ‌కీయ నాయ‌కులారా మీ కుర్చీలు జాగ్ర‌త్త‌.. అందరం న్యూఇయ‌ర్ రోజు పార్టీకి వెళ్తారు... కానీ ర‌జ‌నీకాంత్ పార్టీ పెడ‌తాడు.. అంటూ సెటైర్లు విసురుతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏ బ‌ట‌న్ నొక్కినా ర‌జ‌నీ పార్టీకే ఓటు ప‌డిపోతుంది.. అది త‌లైవా ప‌వ‌ర్‌ అంటూ సెటైర్లు పేలుతున్నాయి.
 
మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తలైవా రాజకీయాల్లోకి రావడం ఈవెంట్ ఆఫ్ ది సెంచరీ అని వర్మ చెప్పారు. అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆయన మార్గంలో నడిచి, అన్ని స్థానాల్లో పోటీ చేయాలని హితవు పలికారు.
 
అదే విధంగా పవన్‌ను టార్గెట్ చేసే కత్తి మహేష్ కూడా రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై స్పందించాడు. పార్టీ పెట్టి పోటీ చేయ్యకుండా ఇంట్లో కూర్చుంటే పిరికిపంద అంటారు అని రజనీకాంత్ తెలిపారు. మరి మా రాష్ట్రంలో పార్టీ పెట్టి పోటీ చేయని పవన్ కల్యాణ్ వున్నాడే.. అంటూ కత్తి మహేష్ ఎద్దేవా చేశాడు. తద్వారా పవన్‌‍ను కత్తి మహేష్ పిరికిపంద అని చెప్పకనే చెప్పారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.