శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (18:11 IST)

నైనా గంగూలీ కాళ్లపై పడిన రామ్ గోపాల్ వర్మ.. నెటిజన్ల ఫైర్ (video)

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు.  వర్మకు మతి చెడిందని, అందుకు విపరీతమైన ప్రవర్తన బయటపడిందని విమర్శలు వస్తున్నాయి. తాజాగా వర్మ నిర్మించిన బ్యూటీఫుల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమా హీరోయిన్ నైనా గంగూలీతో కలిసి వర్మ డాన్స్ చేశాడు. దానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
అంతేకాకుండా వర్మ ఏకంగా హీరోయిన్ నైనా గంగూలీ కాళ్లపై పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనవరి 1న బ్యూటీఫుల్‌ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. నిజానికి నైనా గంగూలీ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆర్టిస్టు. వర్మ నిర్మించిన రంగీలా సినిమా నాటికి నైనా గంగూలీ కనీసం పుట్టలేదు.
 
అంతేకాదు ఇండియాలోనే సూపర్ స్టార్లుగా పేరొందిన అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్, సౌత్‌లో నాగార్జున, వెంకటేష్, జగపతిబాబు, సూర్య, శివరాజ్‌కుమార్ లాంటి వాళ్లతో వరుస సినిమాలు తీసిన రాంగోపాల్ వర్మ ఇలా నైనా గంగూలీ కాళ్లపై పడటం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.