Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వర్మా.. ఖర్మఖర్మ.. పబ్లిసిటీ కోసం ఆడవారి సమస్యను కూడా వదలట్లేదు..

మంగళవారం, 9 జనవరి 2018 (12:48 IST)

Widgets Magazine
RGV

ఎప్పుడూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి ట్విట్టర్‌ వేదికగా, సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, ప్రియాంక చోప్రా నటించిన తాజా చిత్రమైన 'పద్మావత్' గురించి ట్వీట్ చేసాడు. గత ఏడాది డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం టైటిల్ విషయంలో వివాదం తలెత్తింది. అందువలన దర్శకనిర్మాతలు దీన్ని పద్మావత్‌గా మార్చారు. ఇది ఒక చారిత్రాత్మక చిత్రంగా తెరకెక్కెంది. 
 
ఈ చిత్రాన్ని గురించి తన ట్విట్టర్‌లో పేర్కొంటూ "ఒక చారిత్రాత్మక నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం మరియు స్త్రీల రుతుక్రమాన్ని ప్రధానాంశంగా చేసుకుని అక్షయ్ కుమార్ నటించిన ప్యాడ్‌మేన్ చిత్రం ఒకే రోజు రిలీజ్ కావడమే నిజమైన గణతంత్ర దినం" అని ట్వీట్ చేసాడు. అంతేకాకుండా "ఈ చిత్రం రుతుక్రమాన్ని గురించిన గొప్ప చారిత్రాత్మక కథ" అని కూడా ట్వీట్ చేసాడు. 
 
అంటే ఈ చిత్రం రిలీజ్ విషయంలో నెలకొన్న పరిస్థితులను సైతం పబ్లిసిటీ కోసం ఇలా స్త్రీలకు సంబంధించిన అంశాలను వాడేస్తున్నాడు వర్మ. పద్మావత్ మరియు ప్యాడ్‌మేన్ చిత్రాలు రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25వ తేదీన రిలీజ్ కానున్నాయి. ఈ రెండు చిత్రాలకు వర్మ చేసిన ట్వీట్ ఎంతమేరకు ఉపయోగపడుతుందో మరికొన్ని రోజుల్లో తేలనుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

గోల్డెన్ గ్లోబ్స్ 2018, లైంగిక వేధింపులకు నిరసనగా నల్ల దుస్తులు... ఆమె మాత్రం ఎర్ర దుస్తుల్లో?

హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవార్డు ఫంక్షన్లలో గోల్డెన్ ...

news

'కొడకా... కోటేశ్వరరావు ఖరుసైపోతవురో' పాటకు స్పూఫ్.. వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం"అజ్ఞాతవాసి". ఈనెల పదో తేదీన ప్రపంచ ...

news

తరుణ్‌ లవ్‌స్టోరీ ట్రైలర్‌ ఇదే(వీడియో)

చాలాకాలం తర్వాత తరుణ్‌ హీరోగా నటించిన సినిమా 'ఇది నా లవ్‌స్టోరీ'. ఇదేదో రియల్‌ లవ్‌స్టోరీ ...

news

నేను చేసిన తప్పును ఎవ్వరూ చేయవద్దు... కౌన్సిలింగ్ తర్వాత యాంకర్ ప్రదీప్

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిపోయి... ప్రతి ఒక్క మీడియాలో బాగా పాపులర్ అయిన మన ...

Widgets Magazine