గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 30 జూన్ 2022 (13:02 IST)

ప్రస్తుతం నేను పర్ఫెక్టుగా లేను, నాకు ఆ సమస్య: శ్రుతిహాసన్

Shruti Haasan
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
టాలీవుడ్ గ్లామర్ నటీమణుల్లో శృతిహాసన్ కూడా ఒకరు. ఆమధ్య వ్యక్తిగత సమస్యలతో కొన్నాళ్లు వెండితెరకు దూరమైంది. ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయనీ, అందువల్ల వచ్చిన ప్రాజెక్టులను చాలా తీరిగ్గా చెక్ చేసుకుని వరస సినిమాలకు సంతకాలు చేస్తోందిట.

 
ఇదిలావుంటే శ్రుతి హాసన్ పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఆ వీడియోలో శ్రుతి తనకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్య తలెత్తిందని వెల్లడించింది. ఐతే ఇలాంటి సమస్యలు వచ్చిన స్త్రీలు ఎలా ఎదుర్కొంటారో తనకు తెలుసనీ, అందువల్లనే చాలా జాగ్రత్తలు పాటిస్తున్నట్లు చెప్పింది.

 
 ప్రస్తుతం తను మానసికంగా దృఢంగా వున్నాననీ, ఐతే శారీరకంగా పలు సమస్యలున్నాయని తెలిపింది. ఇకపోతే శ్రుతి హాసన్ అగ్రశ్రేణి స్టార్ల సరసన ఛాన్స్ కొట్టేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు.. ఇలా టాప్ స్టార్ల సరసన నటించే అవకాశాలు వస్తున్నందుకు సంతోషంగా వుదని చెప్పింది.