శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : మంగళవారం, 24 మే 2016 (10:16 IST)

జూన్ 10న విడుదలకానున్న ''రైట్ రైట్''

వ‌రుస విజ‌యాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ఏర్ప‌ర‌చుకున్న క్యూట్ హీరో సుమంత్ అశ్విన్ న‌టించిన తాజా చిత్రం "రైట్ రైట్''. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న ''ఆర్డిన‌రీ'' చిత్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కించారు. వ‌త్స‌వాయి వెంక‌టేశ్వ‌ర్లు సమర్పణలో మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ నిర్మించారు. సుమంత్ అశ్విన్ స‌ర‌స‌న‌ పూజా జవేరి నాయిక‌గా న‌టించారు. బాహుబ‌లి ఫేమ్ ప్ర‌భాక‌ర్ కీల‌క పాత్ర పోషించారు. జూన్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 
 
ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ...."నేనిప్పటివరకూ చేసిన అన్ని పాత్రలకూ పూర్తి భిన్నమైన పాత్రను ఈ చిత్రంలో చేశాను. నా పాత్ర చాలా న్యాచురల్ గా ఉంటుంది. లక్ష్యం కోసం తప్పించే ఓ యువకుడి కథ ఇది. అయితే ఆ కుర్రాడు చివరికి బస్ కండక్టర్ అవుతాడు. ఆ బస్సులో అతనికి ఓ మిస్ తారసడుతుంది. ఆ మిస్ తో ఈ బస్ కండక్టర్‌కి ఎలాంటి అనుబంధం ఏర్పడుతుంది? అనేది కథ. ఈ చిత్రాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ, చేశాను. ఫస్టాఫ్ వినోద ప్రధానంగా, సెకండాఫ్ మిస్టరీగా ఉంటుంది'' అని చెప్పారు. 
 
నిర్మాత జె. వంశీకృష్ణ మాట్లాడుతూ...."అన్ని కార్యక్రమాలూ పూర్తయ్యాయి. జూన్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. ఎస్‌.కోట నుంచి గ‌విటికి వెళ్లే ఓ ఆర్టీసీ బ‌స్సు ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. కామెడీ, ల‌వ్‌, మిస్ట‌రీ అంశాలతో ఉత్కంఠభరితంగా సాగే చిత్రం ఇది. సమంత్ అశ్విన్ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం అవుతుంది. సుమంత్ అశ్విన్ కెరీర్ లోనే హయ్యస్ట్ ప్రింట్లతో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. 'బాహుబలి' ఫేమ్ ప్రభాకర్ చేసిన పాత్ర హైలైట్ గా నిలుస్తుంది. 
 
అన్ని వర్గాలవారూ చూడదగ్గ మంచి చిత్రాన్ని రూపొందించాం. కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అని తెలిపారు. నాజ‌ర్‌, ధ‌న‌రాజ్‌, ''ష‌క‌ల‌క'' శంక‌ర్‌, తాగుబోతు ర‌మేశ్‌, జీవా, రాజా ర‌వీంద్ర‌, భ‌ర‌త్‌రెడ్డి, వినోద్‌, పావ‌ని, క‌రుణ‌, జ‌య‌వాణి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జె.బి., పాట‌లు: శ్రీమ‌ణి, కెమెరా: శేఖ‌ర్ వి.జోస‌ఫ్‌, మాట‌లు: ''డార్లింగ్‌'' స్వామి, ఆర్ట్ : కె.ఎమ్‌.రాజీవ్‌, కో ప్రొడ్యూస‌ర్‌: జె.శ్రీనివాస‌రాజు, నిర్మాత‌: జె.వంశీకృష్ణ‌, ద‌ర్శ‌క‌త్వం: మ‌ను, స‌మ‌ర్ప‌ణ‌: వ‌త్స‌వాయి వెంక‌టేశ్వ‌ర్లు.