గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 24 నవంబరు 2022 (15:27 IST)

'వరాహ రూపం' పాటతో ఓటీటీలో విడుదలైన "కాంతార"

Kantara
ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం "కాంతార". కేవలం 16 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లను వసూలు చేసి నిజమైన బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. కన్నడంలో 'కేజీఎఫ్' కలెక్షన్ రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధమైంది. ఇపుడు ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసింది. అమేజాన్ ప్రైమ్ ఓటీటీలో గురువారం అర్థరాత్రి నుంచి స్ట్రీమిగ్ అవుతోంది. 
 
ఇప్పటికే 50 రోజులను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబరు 24వ తేదీన కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేశారు. పైగా, ఈ చిత్రంపై ఉన్న ఒకే ఒక్క వివాదాన్ని కూడా కోర్టు కొట్టివేసింది. ముఖ్యంగా, ఈ చిత్రానికి హైలెట్‌గా నిలిచిన "వరహ రూపం" పాట సినిమాలో ప్రదర్శించరాదంటూ దాఖలైన అన్ని పిటిషన్లను కేరళ హైకోర్టు కొట్టివేసింది. దీంతో 'కాంతార' సినిమా ఓటీటీలో విడుదల చేసేందుకు ఉన్న ఏకైక అడ్డంకి కూడా తొలగిపోయింది.