శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2023 (19:10 IST)

కాంతారా 2: స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న రిషబ్ శెట్టి

Kanthara
కన్నడ యువ ప్రముఖ నటుల్లో ఒకరిగా మారిన దర్శకుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతారా’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇది కన్నడం, తమిళం, హిందీ, తెలుగు, మలయాళం వంటి భాషల్లో విడుదలై ఘన విజయం సాధించింది. 
 
రూ.16 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అతిపెద్ద రికార్డు సృష్టించింది. దీంతో ‘కాంతారా’ చిత్రం 2వ భాగం రూపొందుతోంది. దీన్ని రిషబ్ శెట్టినే తెరకెక్కిస్తున్నారు. 
 
అయితే, ‘కాంతారా 2’ చిత్ర షూటింగ్ డిసెంబర్ నెలలో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఆగస్ట్ నెలలో పూర్తిస్థాయిలో పూర్తయ్యే సమాచారం వెలువడింది. మొదటి భాగం కంటే బ్రహ్మాండమైన బడ్జెట్‌ను రూపొందించడానికి ప్రణాళిక చేయబడింది.
 
యాక్షన్ సీన్స్ కోసం భారీగా ఖర్చు పెట్టనున్నట్లు సమాచారం. ఇందులో రిషబ్ శెట్టి, యాక్షన్‌తో పాటు నటనకు గాను.. విశేష శిక్షణ పొందుతున్నారు.