గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (14:50 IST)

రీతు వ‌ర్మ‌,ను "ఇంకోసారి ఇంకోసారి` అంటోన్న నాని

Nani, Rituvarma, inkosari song
స‌హ‌జ న‌టుడుగా పేరుపొందిన నాని  హీరోగా నటించిన 'టక్ జగదీష్' 2021లో  ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. 'నిన్నుకోరి` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల  క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని స‌ర‌స‌న నాయిక‌లుగా రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ న‌టిస్తున్నారు. నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని  షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు.
 
మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌. త‌మ‌న్ మ్యూజిక్ ఈ సినిమాకు ఓ ఎస్సెట్‌. ఆయ‌న సుమ‌ధుర స్వ‌రాలు కూర్చిన "ఇంకోసారి ఇంకోసారి" అనే పాట లిరిక‌ల్ వీడియోను ఫిబ్ర‌వ‌రి 13 ఉద‌యం 9 గంట‌ల‌కు లాంచ్ చేస్తున్న‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది. ఈ పాట‌‌ను చిత్రంలో నాని, రీతు వ‌ర్మ జంట‌పై చిత్రీక‌రించారు. ఇదివ‌ర‌కు రిలీజ్ చేసిన రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ పోస్ట‌ర్‌లో కుటుంబ సభ్యుల మధ్యలో పెళ్ళికొడుకుగా రెడీ అవుతున్న నాని లుక్ వైర‌ల్ అయ్యింది.
 
ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌టంతో పాటు ర‌చ‌న కూడా శివ నిర్వాణ చేస్తున్న ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ప్ర‌వీణ్ పూడి ఎడిట‌ర్‌గా, వెంక‌ట్ ఫైట్ మాస్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.