శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 11 జులై 2023 (17:38 IST)

లండన్‌ గడ్డపై రాకింగ్‌ రాకేశ్‌, జోర్దార్‌ సుజాత బోనాల జాతర

Rocking Rakesh, Zordar Sujatha,
Rocking Rakesh, Zordar Sujatha,
వరంగల్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ ఫొరమ్‌ లండన్‌లో బోనాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత పదేళ్లుగా ఈ ఉత్సవం నిర్వహిస్తునప్పటికీ ఈ ఏడాది మరింతగా ఘనంగా నిర్వహించాలని ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌ నిర్ణయించుకుంది. యాంకర్, నటి తెలంగాణ మహిళ జోర్దార్‌ సుజాత ఆధ్వర్యంలో బోనాల జాతర నిర్వహించారు. ఈ మేరకు ఫోరమ్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ నీల మాట్లాడుతూ ‘‘తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాల ఉత్సవాలు ఎన్నో ఏళ్లగా లండన్‌లో నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ఎప్పటిలా కాకుండా మరింత ఘనంగా చేస్తున్నాం. ఈ వేడుకలో మరింత ఉత్సాహాన్ని నింపడానికి హైదరాబాద్‌ నుంచి రాకింగ్‌ రాకేశ్‌, సుజాత ఇక్కడికి రావడం ఆనందించదగ్గ విషయం’’ అని తెలిపారు.
 
Rocking Rakesh, Zordar Sujatha,
Rocking Rakesh, Zordar Sujatha,
నేరెళ్ల వేణుమాధవ్‌ శిష్యుల తర్వాత రాకింగ్‌ రాజేశ్‌ మిమిక్రీ అంతగా పాపురల్‌ అయ్యారు. బజర్దస్త్‌ వంటి షోలతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. ఇటీవల అమెరికా, న్యూజెర్సీలోని నాట్స్‌ కార్యక్రమం విజయవంతం తర్వాత రాకింగ్‌ రాకేశ్‌, జోర్దార్‌ సుజాత లండన్‌లో జరిగిన బోనాల ఉత్సవంలో తమదైన శైలి స్కిట్లు, మిమిక్రీ కార్యక్రమాలతో అలరించారు. ఈ షోతో ఆయన 2300 షోల మార్కును దాటారు. 
 
ఈ మేరకు రాకింగ్‌ రాకేశ్‌ మాట్లాడుతూ ‘‘వరంగల్‌ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. కరోనా సమయంలోనే కాకుండా మామూలు సమయంలో కూడా ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమందికి నా ద్వారా డబ్బు పంపి సహకారం అందించారు. చిన్నారుల, చదువు ఆర్యోగాలకు సహకరించారు. ఈసారి బోనాల వేడుకలో మేం భాగం కావాలని వరంగల్‌ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌ కోరంగా.. గతంలో వారు చేసినా సేవలకు కృతజ్ఞతా భావంతో లండన్‌ షో చేశాం. మమ్మల్ని ఇందులో భాగం కావాలని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం లండన్‌లో చేసిన షోతో 2300 షోలను పూర్తి చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫోరమ్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ నీల, ఫౌండర్‌ కిరణ్‌ పసునూరి, జనరల్‌ సెక్రటరీ రమణ, వైస్‌ ప్రెసిడెంట్‌ నాగ ప్రశాంతి, ప్రవీణ్‌ బిట్ల, కమల తదితరులకు కృతజ్ఞతలు’’ అని అన్నారు.