శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 18 ఆగస్టు 2019 (09:04 IST)

బిగ్ బాస్ -3 : ఎలిమినేట్ కానున్న శ్రీముఖి - రోహిణి?

ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ -3 ప్రసారాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. నాలుగో వారంలోకి ప్రవేశించిన ఈ ప్రసారాలు ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. అయితే, సీజన్ -3లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో సోషల్ మీడియాలో తెగ చర్చ సాగుతోంది. 
 
ఆదివారం హౌస్ నుంచి రోహిణి లేదా శ్రీముఖి బయటకు రావొచ్చంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎలిమినేషన్ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ ఒకటి, రెండు రోజులు ముందుగానే చిత్రీకరిస్తుండటంతో, ప్రతివారమూ ఎవరు హౌస్ నుంచి బయటకు వస్తున్నారన్న విషయం ముందుగానే లీకై పోతున్న సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో ఈ వారంలో వంటగదిలో జరిగిన గొడవ, వితికా, వరుణ్ మధ్య గుసగుసలు, రవికృష్ణ, అషూల మధ్య సంభాషణ, పునర్నవి, రాహుల్‌ల చర్చలు హైలెట్‌గా నిలిచాయి. 
 
అదేసమయంలో ఈ వారం శివజ్యోతి, వరుణ్‌ సందేశ్‌, బాబా భాస్కర్‌, శ్రీముఖి, రవికృష్ణ, రాహుల్‌, రోహిణి ఎలిమినేషన్ జోన్‌లో ఉండగా, శివజ్యోతి, వరుణ్‌ సందేశ్‌ సేఫ్ జోన్‌లోకి వచ్చేసినట్టు శనివారం రాత్రి ఎపిసోడ్‌లో నాగ్ ప్రకటించేశారు. అయితే, ఆదివారం ఈ హౌస్ నుంచి ఎవరు వస్తారన్నదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.