కాలా బిజినెస్ సూపర్.. కబాలిని మించిపోయింది.. రూ.230కోట్లకి?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా సినిమా ''కాలా''. ఈ సినిమా బిజినెస్ ఉరుకులు పెడుతోంది. తద్వారా కాలా బిజినెస్ కబాలికి మించిపోయింది. కర్ణాటకలో సినిమాకు బ్రేక్ పడే ఛాన్సుందని.. దీంతో కాలాకు కలెక్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా సినిమా ''కాలా''. ఈ సినిమా బిజినెస్ ఉరుకులు పెడుతోంది. తద్వారా కాలా బిజినెస్ కబాలికి మించిపోయింది. కర్ణాటకలో సినిమాకు బ్రేక్ పడే ఛాన్సుందని.. దీంతో కాలాకు కలెక్షన్లు తగ్గిపోతాయనుకున్న విశ్లేషకుల అంచనాలను కాలా బిజినెస్ తలకిందులు చేస్తోంది.
రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ''కాలా'' సినిమా ఈ నెల 7వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కబాలితో పోలిస్తే కాలా ప్రీ రిలీజ్ బిజినెస్ అందరికీ షాక్ ఇచ్చింది.
థియేట్రికల్ రైట్స్ కాలాకు తక్కువే పలికినా.. శాటిలైట్ రైట్స్ రూపంలో భారీగా కలిసిరావడంతో, కబాలిని కాలా అధిగమించింది. కబాలి రూ.218కోట్ల బిజినెస్ చేయగా, కాలా బిజినెస్ రూ. 230 కోట్ల మార్క్‌ను చేరుకుంది. అలాగే ఓవర్సీస్‌ల్లోనూ కబాలి కంటే అదనంగా రూ.10కోట్లు అదనంగా రాబట్టింది.