శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2023 (10:35 IST)

నందమూరి బాలయ్య కోసం శ్రీలీల సాంగ్.. రూ.5 కోట్ల ఫీజు

sree leela
నందమూరి బాలకృష్ణ- అనిల్ రావిపూడి కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురుగా ‘పెళ్లి సందడి’ నటి శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుంది. 
 
ఈ సినిమా గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ఈ చిత్రంలో ప్రతీ పాత్ర చిత్రీకరణ బాగుంటుందని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ కీలక పాత్ర ఈ సినిమాకు హైలైట్. బాలకృష్ణ క్యారెక్టర్‌ని కామెడీతో డిజైన్ చేయడంతో పాటు యాక్షన్ సీన్స్‌కు మరింత ప్రాధాన్యతనిస్తున్నట్లు వెల్లడించారు. 
 
ముంబైకి చెందిన వందలాది మంది స్థానిక జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్‌లతో కూడిన కొత్త మాస్ సాంగ్ షూట్ ప్రారంభమైంది. శ్రీలీల నటించిన ఈ పాట షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమాలోని పండుగ సందర్భంగా ఈ పాటను ప్రదర్శించాలని భావిస్తున్నారు.
 
ఈ పాట చిత్రీకరణను నాలుగైదు రోజుల్లో ముగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. శ్రీలీల పాట కోసం మేకర్స్ 5 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఖరారు చేసినట్లు వర్గాలు వెల్లడించాయి.  
 
వరుస హిట్లతో దూసుకుపోతున్న నటి శ్రీలీల ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తోంది. రాబోయే డ్రామా #NBK108లో నందమూరి బాలకృష్ణ మార్క్ యాక్షన్- మాస్ ఎలిమెంట్, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ ఉంటాయి.