శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 11 జనవరి 2017 (16:44 IST)

చిరంజీవి గారూ పదేళ్లు మిస్ చేసుకున్నాం.. కుమ్మేశారంతే.. ఖైదీలో ఆ రెండు పొలిటకల్ డైలాగ్స్ అదుర్స్..

ప్రముఖ దర్శకుడు, బాహుబలి జక్కన్న 'ఖైదీ నంబర్‌ 150' చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురింపిచారు. పదేళ్ల పాటు మెగాస్టార్ చిరంజీవిని మిస్ అయ్యామంటూ ట్వీట్ చేసారు. 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ చిరంజీవిగారు తిరిగి వచ్చ

ప్రముఖ దర్శకుడు, బాహుబలి జక్కన్న 'ఖైదీ నంబర్‌ 150' చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురింపిచారు. పదేళ్ల పాటు మెగాస్టార్ చిరంజీవిని మిస్ అయ్యామంటూ ట్వీట్ చేసారు. 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ చిరంజీవిగారు తిరిగి వచ్చినందుకు ధన్యవాదాలని తెలిపారు. పదేళ్ల మిమ్మల్ని మిస్ చేసుకున్నామన్నారు. 
 
రికార్డు బ్రేకింగ్‌తో నిర్మాతగా తెరంగేట్రం చేసిన చరణ్‌కు శుభాకాంక్షలు. వినయ్‌గారు.. కుమ్మేశారంతే.. మీకన్నా బాగా ఈ ప్రాజెక్టును ఇంకెవరూ తీయలేరు. టీమ్‌ కేఎన్‌150.. ఇది పెద్ద విజయం' అని రాజమౌళి ట్వీట్‌ చేశారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో కాజల్‌ కథానాయికగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు.
 
ఇకపోతే.. ఖైదీ కోసం.. ఒరిజినల్ 'కత్తి' నుంచి కొన్ని డిలీషన్స్ తప్పలేదని చిరంజీవి ముందే చెప్పారు. రాజకీయాలను టచ్ చేస్తూ వున్న కొన్ని డైలాగుల జోలికి తాను వెళ్లనేలేదని రిలీజుకు ముందు స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే ఖైదీ మూవీలో 'పొలిటికల్ పంచ్' మిస్సవుతుందని భావించిన ఫ్యాన్స్‌కు పొలిటకల్ డైలాగ్స్ కూడా వినిపించాయి. 
 
చిరు పొలిటికల్ నేచర్‌ని గుర్తు చేస్తూ రెండు చోట్ల రెండు 'కత్తి' లాంటి డైలాగులు వినిపించాయి. 'అభిమానాన్ని అమ్ముకునేంత అవినీతి నాకు తెలీదు సర్‌', 'నవ్విన వాళ్లకి చెప్పు... ఏడ్చే రోజు త్వరలోనే వస్తుందని' చిరంజీవి నోటి నుంచి ఈ మాటలు వినిపించగానే అభిమానుల కేరింతలతో థియేటర్ దద్దరిల్లింది.