శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శనివారం, 4 ఫిబ్రవరి 2017 (17:07 IST)

మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్రవరి 24న రిలీజ్ కానున్న సాయిధ‌ర‌మ్‌ తేజ్ `విన్న‌ర్`

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా గ్రాండ్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం `విన్న‌ర్‌`. ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఈ సినిమా రూపొందుతోంది. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ మ‌లి

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా గ్రాండ్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం `విన్న‌ర్‌`. ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఈ సినిమా రూపొందుతోంది.  బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌కుడు. ఒక పాట మిన‌హా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ప్ర‌స్తుతం సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ ఆధ్వ‌ర్యంలో రీరికార్డింగ్ కార్య‌క్ర‌మాలు  జ‌రుగుతున్నాయి.
 
ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని మాట్లాడుతూ ``త‌నకు జ‌న్మ‌నిచ్చిన తండ్రిని, మ‌న‌సిచ్చిన అమ్మాయిని గెలవ‌డం కోసం ఓ యువ‌కుడు చేసిన పోరాట‌మే ఈ సినిమా. `విన్న‌ర్` అనే టైటిల్ మా క‌థ‌కు యాప్ట్. టైటిల్ విన్న వారంద‌రూ పాజిటివ్‌గా ఉంద‌ని చెబుతున్నారు.  ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇటీవ‌లే ` సితార సితార...` అంటూ సాగే పాట‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు విడుద‌ల చేశారు. ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. త‌మ‌న్ చాలా మంచి సంగీతాన్నిచ్చారు. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. అన్ని వ‌ర్గాల వారికీ న‌చ్చేలా సినిమాను తీర్చిదిద్దుతున్నాం`` అని అన్నారు.
 
నిర్మాత‌లు మాట్లాడుతూ ``బాల‌న్స్ సాంగ్‌ని ఈ నెల 12 నుంచి చిత్రీక‌రిస్తాం. ప్ర‌స్తుతం రీరికార్డింగ్ జ‌రుగుతోంది. ఈ నెల 9న థియేట్రిక‌ల్ విడుద‌ల చేస్తాం. 19న ఆడియో ప్రీ రిలీజ్ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నాం. ప్ర‌స్తుతం మా సినిమాలోని ఒక్కో పాట‌ను ఒక్కో సినీ ప్ర‌ముఖుడితో విడుద‌ల చేయిస్తున్నాం. అందులో భాగంగానే ఇటీవ‌ల సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు ఓ పాట‌ను విడుద‌ల చేశారు. `సితార సితార..` అనే ఆ పాట‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌స్తోంది. మ‌రో ఐదుగురు సెల‌బ్రిటీలు మిగిలిన ఐదు పాట‌ల‌ను విడుద‌ల చేస్తారు. 
 
త‌మ‌న్ చాలా మంచి సంగీతాన్నిచ్చారు. మా ద‌ర్శ‌కుడు చాలా అద్భుతంగా చిత్రాన్ని తెర‌కెక్కించారు. సినిమా మీద చాలా కాన్ఫిడెన్ట్‌గా ఉన్నాం. మ‌హా శివ‌రాత్రిని పుర‌స్క‌రించుకుని ఈ నెల 24న సాయిధ‌ర‌మ్‌తేజ్ కెరీర్‌లోనే అత్య‌ధిక థియేట‌ర్ల‌లో చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం. అబ్బూరి ర‌వి, శ్రీధ‌ర్ సీపాన ర‌చ‌న ఆక‌ట్టుకుంటుంది. వెలిగొండ శ్రీనివాస్ మంచి క‌థ‌నిచ్చారు`` అని తెలిపారు.
 
సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ముకేష్ రుషి, అలి, వెన్నెల‌ కిశోర్ త‌దిత‌రులు ఇతర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి  కెమెరా:  చోటా.కె.నాయుడు, సంగీతం:  త‌మ‌న్‌, ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్‌పూడి, ఆర్ట్:  ప్ర‌కాష్‌, ఫైట్స్:  ర‌వివ‌ర్మ‌, క‌థ‌: వెలిగొండ శ్రీనివాస్‌, ర‌చ‌న‌: అబ్బూరి ర‌వి, శ్రీధ‌ర్ సీపాన‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని.