మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 21 జూన్ 2017 (21:22 IST)

సాయిధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" ఫస్ట్ లుక్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్న చిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పైన కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే టాకీ పార్టు పూర్తిచేసుకున్న ఈ చిత్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్న చిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పైన కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే టాకీ పార్టు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఇటలీలో రెండు పాట‌లు షూటింగ్ జ‌రుపుకున్నారు. ఈ నెల 23 నుండి హైదరాబాద్‌లో యాక్ష‌న్ పార్టు చిత్రీక‌రిస్తారు. 
 
మిగిలిన షూటింగ్ పార్ట్ అంతా జులైలో షూట్ చేసి ఆగ‌ష్టులో చిత్రాన్ని విడుదల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ప్రీలుక్ పోస్ట‌ర్, టైటిల్‌కి చాలా మంచి స్పంద‌న రావ‌టంతో యూనిట్ స‌భ్యులు మ‌రింత ఉత్సాహంతో వున్నారు. చిత్ర ద‌ర్శ‌కుడు బివిఎస్ ర‌వి జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ చిత్రం మొద‌టి లుక్‌ని విడుద‌ల చేశారు.
 
దిల్ రాజు మాట్లాడుతూ.... సాయి ధరమ్ తేజ్‌కు మా బ్యానర్‌కు మంచి రిలేషన్ ఉంది. బివిఎస్ రవి మా ప్రొడక్షన్‌కి మాకు మంచి రిలేష‌న్ వుంది. జవాన్ స్టోరీ చాలా బాగుంటుంది సాయి ధరమ్ తేజ్‌కు సరిగ్గా సరిపోయే స్టోరీ. ఈ చిత్రాన్ని మా సన్నిహితుడు కృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా అనుకున్నట్టుగా అనుకున్న టైంలో చాలా బాగా వచ్చింది. జ‌వాన్ ప్రీలుక్ చాలా బాగుంది. అలానే ఇప్ప‌ుడు విడుద‌ల చేసిన మొద‌టి లుక్ కూడా చాలా బాగుంది అని అన్నారు.
 
దర్శకుడు బివిఎస్ రవి మాట్లాడుతూ... జ‌వాన్ చిత్రం మంచి కాన్సెప్టుతో తెర‌కెక్కుతుంది. దేశానికి జవాన్ ఎంత అవసరమో... ప్రతీ ఇంటికి మా కథానాయకుడి లాంటి వాడు ఉండాలని చెప్పడమే మా ఉద్దేశ్యం. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడికి ఎలాంటి కష్టాలు వచ్చాయి. తన కుటుంబాన్ని మ‌నోదైర్యంతో త‌న బుద్ధిబ‌లంతో ఎలా కాపాడుకున్నాడన్నదే జవాన్ కథ. అందుకే ఇంటికొక్కడు అనే క్యాప్షన్ పెట్టాం. ఇది పక్కా ఫ్యామీలీ ఎమోషన్స్‌తో కూడిన ఎంటర్ టైనింగ్ కమర్షియల్ చిత్రం. తమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. మెహ్రీన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ప్రసన్న మెయిన్ విలన్‌గా నటించారు. మా ప్రీలుక్ ఎలా ఆక‌ట్టుకుందో, ఈ మొద‌టి లుక్ కూడా దాన్ని మించి ఆక‌ట్టుకుంటుంది అని అన్నారు. 
 
నిర్మాత కృష్ణ మాట్లాడుతూ.... జవాన్ ప్రాజెక్ట్ విషయంలో మా ధైర్యం మా దిల్ రాజు గారు. ఆయ‌న ముందుండి ఈ ప్రోజెక్ట్‌ని స్మూత్‌గా కంప్లీట్ చేశారు. ద‌ర్శ‌కుడు బివిఎస్ రవి చెప్పిన కథ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సాయిధ‌ర‌మ్‌ తేజ్‌కి స‌రిగ్గా స‌రిపోయే క‌థ‌. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా గ్రాండియర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇటీవ‌లే ఇట‌లీ లో అంద‌మైన లోకేష‌న్స్‌లో రెండు పాట‌లు షూటింగ్ పూర్తిచేసుకున్నాం. కొరియోగ్రాఫ‌ర్ ర‌ఘు మాస్ట‌ర్ ఓ పాట‌ని, శేఖ‌ర్ మాస్ట‌ర్ ఓ పాట‌ని కొరియోగ్ర‌ఫి చేశారు. సాంగ్స్ చాలా బాగా వ‌చ్చాయి. జూన్ 23 నుండి హైద‌రాబాదులో యాక్ష‌న్ పార్ట్ చిత్రీక‌రిస్తాము. మిగిలిని షూటింగ్ పార్ట్ ని జులైలో కంప్లీట్‌ చేసి ఆగ‌ష్టులో చిత్రాన్ని విడుదల చేస్తాము అని అన్నారు.
 
నటీనటులు - సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్, ప్రసన్న , జయప్రకాష్, ఈశ్వరీ రావ్ తదితరులు; సమర్పణ - దిల్ రాజు, నిర్మాత - కృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - బివిఎస్ రవి.