శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: బుధవారం, 17 అక్టోబరు 2018 (20:26 IST)

రూటు మార్చి అదృష్ట దేవత కోసం వేచి చూస్తున్న సాయి ధరమ్

వరుసగా ఆరు ఫ్లాప్‌లు రావడంతో సినిమాలు చేయడం మానేశాడు సాయిధరమ్ తేజ్. తేజ్ ఐలవ్ యు సినిమా ఫెయిల్ కావడంతో నిరుత్సాహం ఆవరించింది సాయి ధరమ్ తేజ్ ఐదు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఎలాంటి సినిమాలు చేయాలి అన్న విషయంలో కన్ఫూజనై కొంతకాలం గ్యాప్ ఇచ్చాడు. ఐదు నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమాని ప్రారంభించారు. 
 
సాయిధరమ్ తేజ్ తాజాగా ఒప్పుకున్న చిత్రం చిత్రలహరి. ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్ధ  మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. నేను శైలజ, ఉన్నదొక్కటే జిందగీ సినిమాలు తీసిన కిషోర్ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను సాయిధరమ్ బర్త్ డే సంధర్భంగా లాంచ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ సరసన హలో సినిమా ఫేమ్ కళ్యాణి నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్‌కు ఈ సినిమా కీలకం. 
 
ఎలాంటి సినిమాలు చేయాలో ఆలోచించే సినిమాలు చేస్తున్నట్లు అభిమానులకు లేఖ రాశాడు సాయి ధరమ్ తేజ్. ఈ మూవీతో అయినా సాయి ధరమ్ తేజ్ విజయాల బాట పడతాడో లేదో వేచి చూడాలి.