సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (18:28 IST)

క‌ట్టుకున్న‌వాడ్ని వ‌దిలి అర‌ణ్యానికి వ‌చ్చిన సాయిప‌ల్ల‌వి దొంగ‌లంజెడి కొడుకా! అన్న‌దెందుకు? (video)

Saipallavi virataparvam
రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన సినిమా `విరాట‌ప‌ర్వం`. ఈ సినిమా టీజ‌ర్ గురువారంనాడు కొద్దిసేప‌టి క్రిత‌మే మెగాస్టార్ చిరంజీవి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేశారు. నా చేతుల‌మీదుగా విడుద‌ల‌కావ‌డం చాలా సంతోషంగా వుందంటూ, గుడ్ ల‌క్ ఎంటైన్ టీమ్ అంటూ ట్వీట్ చేశారు.
ఇక టీజ‌ర్‌ప‌రంగా చూస్తే, నిజ‌మైన సంఘ‌ట‌న‌ల ఆధారంగా తీసిన చిత్రమిది అంటూ `విరాట‌ప‌ర్వం‌` గురించి టైటిల్ కార్డ్ వ‌స్తుంది. అనంత‌రం రానా క‌విత్వం రాస్తుండ‌గా, ఆయ‌న వాయిస్‌తో..  ఆదిప‌త్య జాడ‌ల‌నే చెరిపేయ‌గా ఎన్ని నాళ్ళు. తార‌త‌మ్య గోడ‌ల‌ను బిగిలించ‌క ఎన్నినాళ్ళు, దున్నేటోడి భూమిని వెన్నువిరిచి భూస్వాములు ధ‌నికులైరి. అని వ‌స్తుంది.
 
ఇక మ‌రోవైపు, సాయిప‌ల్ల‌వి. ప్రియ‌మైన అర‌ణ్య నీకు నేను అభిమాని అయిపోయాను. నీ క‌విత్వం చ‌దువుతుంటే నాలో తెలీని భావోద్వేగం ర‌గులుతుంది. మీరాభాయ్ కృష్ణుడికోసం క‌న్న‌వారిని, క‌ట్టుకున్న‌వాడిని వ‌దిలి ఎలా వెళ్ళిపోయిందో అలా నేను నీకోసం వ‌స్తున్నాను. అనుకుంటూ ఇస్త‌రాకులో పోరాటం గుర్తు అయిన క‌త్తి కొడ‌వ‌లి గుర్తు చూసి త‌న్మ‌య‌త్వం చెందుతుంది. ‌
అలా అనుకుంటూ ఊహించుకుంటూ బ‌స్సులో ప్ర‌యాణిస్తూ,, కిటికీలోనుంచి ప్ర‌కృతిని చ‌ల్ల‌టిగాలిని ఆస్వాదిస్తూ, సీతాకోక‌చిలుక‌లా నీకోసం చ‌చ్చిపోవాల‌నిపిస్తుంది. ప్రేమ‌కు ఇంత శ‌క్తివుందా! అంటూ మ‌నోఫ‌లకంలో ఆనందిస్తూ అర‌ణ్యంలోకి అడుగుపెడుతుంది. 
 
ఆమె వ‌చ్చాక కొన్ని అనుకోని సంఘ‌ట‌న‌లు, పోరాటాలు జ‌రుగుతాయి. అక్క‌డి ప్ర‌జ‌లు చిన్నాభిన్నం బిక్క‌బిక్క‌మంటూ వుంటారు.. ఆలాంటి స‌మ‌యంలో ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చిన సాయిప‌ల్ల‌వి. `దొంగ‌లంజెడికొడుకా` అంటూ, కింద‌నుంచి రాయితీసి విసిరేస్తూ అరుస్తుంది. అలా ఎందుకు అంది. ఎవ‌రిని అంది? అనేది వెండితెర‌పై చూడాల్సిందే అంటూ టీజ‌ర్ సారాంశం. అది తెలియాలంటే ఏప్రిల్ 30 వ‌ర‌కు ఆగాల్సిందే. డి.సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో సుధాక‌ర్ చెరుకూరి నిర్మించ‌గా వేణు ఉడుకుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.