ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 నవంబరు 2023 (18:14 IST)

సలార్ టీ షర్ట్స్ వచ్చేశాయి.. ధర రూ.499 నుంచి రూ.1,499

salaar movie still
రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా సలార్ వచ్చే నెల 22న రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ మేకర్స్ సలార్ టీ షర్ట్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా నిర్మించిన హొంబలె ఫిల్మ్స్ వెబ్ సైట్ ద్వారా వీటిని అమ్మకానికి పెట్టారు. 
 
ఒక్కో టీ షర్ట్ ధర రూ.499 నుంచి రూ.1,499 వరకు ఉంది. కానీ టీషర్ట్స్ రేటు చూసి అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అంతలేసి ధరలు పెడితే సామాన్యులు ఎలా కొంటారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.