శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 29 మే 2019 (12:15 IST)

కట్టప్ప ఆ పని ఎందుకు చేశారో ఇప్పటికీ అర్థంకావట్లేదు : కండలవీరుడు

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం "బాహుబలి". రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం భారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాసింది. ఈ సిరీస్ తొలి భాగం ఆఖరులో 'బాహుబలి'ని కట్టప్ప వెన్నుపోటు పొడిచి చంపేస్తాడు. ఈ ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెండో భాగం విడుదలైన తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం లభించింది. అయితే, ఇపుడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇపుడు ఇదే అంశాన్ని లేవనెత్తాడు.
 
అసలు 'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు అన్నది సల్మాన్ ఖాన్ ప్రశ్న. తాను నటించిన తాజా చిత్రం "భారత్". ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సల్మాన్ సమాధానమిస్తూ, 'బాహుబలి' సిరీస్‌లో మొదటి భాగాన్ని మాత్రమే చూశానని, రెండో భాగం చూడలేదన్నారు. అందుకే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడే తనకు ఇప్పటికీ అర్థం కాలేదన్నారు. రెండో భాగంలో ఏం జరిగిందో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చాడు.