శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (12:22 IST)

పెళ్ళి కాలేదు.. ఓ ముగ్గురో, నలుగురో పిల్లలుంటే బాగుండేది: సల్మాన్ ఖాన్

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా పేరున్న బాలీవుడ్ సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్ చేశాడు. తనకు పెళ్లి చేసుకునే వయసు దాటిపోయిందని, అయినా తాను సంతోషంగానే ఉన్నానని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించాడు. 
 
అయితే ఓ ముగ్గురో, నలుగురో పిల్లలు ఉంటే బాగుండేదని ఒకింత నిర్వేదంగా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించాడు. భారత్‌లో వివాహం కాకుండా పిల్లల్ని కనడం చట్టపరంగా సాధ్యం కాదనే సంగతి అతనికి తెలిసే ఉంటుందని, ఈ కథనాన్ని ప్రచురించిన 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' అభిప్రాయపడటం గమనార్హం. 
 
కాగా ఖాన్ త్రయంలో ఒకడైన సల్మాన్ ఖాన్ మనసు ఇప్పటివరకు పెళ్ళి మీదకు పోలేదు. ఈ నేపథ్యంలో పుణెలోని ఓ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటిస్తున్న వేళ, చర్చ అతని పెళ్లి మీదకు మళ్లింది.