శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 అక్టోబరు 2021 (13:12 IST)

విడాకుల ప్రకటన తర్వాత ట్విట్టర్ ఖాతా పేరు మార్చిన సమంత

టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్యతో వైవాహిక జీవితానికి గుడ్‌బై చెప్పిన హీరోయిన్ సమంత మళ్లీ తన ట్విట్టర్ ఖాతా పేరును మార్చేసింది. చైతూతో విడిపోతున్నాన‌ని శనివారం ఆమె అధికారికంగా ప్ర‌క‌ట‌న చేశారు. ఆ త‌ర్వాత తన పేరును కేవలం సమంతగానే మార్చేశారు. 
 
నిజానికి వారు విడాకులు తీసుకుంటున్నార‌ని కొన్ని రోజులుగా మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నప్ప‌టికీ స్పందించ‌ని వారిద్ద‌రు నిన్న‌ సామాజికమాధ్య‌మాల్లో అధికారికంగా తాము విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేశారు.
 
దానికంటే ముందు కొన్ని రోజుల క్రితం స‌మంత త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ప్రొఫైల్ పేరును మార్చ‌డంతో ఆమె నాగ‌చైత‌న్య‌తో విడిపోనుంద‌న్న ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. నాగ చైత‌న్య‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఆమె ట్విట్ట‌ర్‌లో త‌న‌ పేరును స‌మంత అక్కినేనిగా మార్చుకోగా, కొన్ని నెల‌ల క్రితం అక్కినేని పేరును తొల‌గించింది. త‌న పేరును 'ఎస్'గా పెట్టుకుంది. త‌న పేరులో మొద‌టి అక్ష‌రాన్ని మాత్ర‌మే ఆమె ఉంచింది. మ‌ళ్లీ 'ఎస్' అక్ష‌రాన్ని తొల‌గించి 'స‌మంత'గా మార్చేసుకుంది.