శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (18:40 IST)

''దియా''పై మనసుపడిన సమంత.. ప్రేమ విఫలమై కొత్త ప్రేమ పుడితే?

రీమేక్ అనేది సినీ ఇండస్ట్రీలో సామాన్యం. ఇతర భాషల్లో హిట్టైన సినిమాలను వేరొక భాషలోకి రీమేక్ చేస్తుంటారు. అలా దక్షిణాదిన, ఉత్తరాదిన పలు సినిమాలు ఇప్పటికే రీమేక్ అవుతున్నాయి. ఇలా చాలా సినిమాలు తెలుగులో రీమేక్‌గా వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక అక్కినేని వారి కోడలు సమంత గత కొంత కాలంగా రీమేక్‌లపై దృష్టి పెట్టిందని చెప్పవచ్చు.
 
యూ టర్న్ సినిమా కన్నడ నుంచి రీమేక్ చేసిన సినిమా. ఆ తర్వాత ఓ బేబీ సినిమా కొరియన్ మూవీ. తాజాగా వచ్చిన 96 తమిళ రీమేక్ అనే సంగతి తెలిసిందే. తాజాగా మరో కన్నడ చిత్రం తెలుగు రీమేక్‌లో సమంత నటించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. 
 
కన్నడలో మంచి విజయాన్ని అందుకున్న ''దియా" సినిమా త్వరలో తెలుగులో రీమేక్ కానుందని సమాచారం. ఈ సినిమాలో సమంత నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కథాపరంగా మంచి పట్టున్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని సినీ పండితులు అంటున్నారు. ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఓ అమ్మాయి కథ. మరో కొత్త ప్రేమకు దారితీసిన అంశాలు ఏంటనే అంశాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది.