మంగళవారం, 4 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (12:48 IST)

600 మెట్లు ఎక్కి.. పళని కుమార స్వామిని దర్శించుకున్న సమంత

Samantha
Samantha
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రభు ప్రస్తుతం మయోసైటిస్‌ నుంచి రికవరీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నటి కొన్ని వారాల క్రితం చికిత్స కోసం అమెరికాకు వెళ్లింది. 
 
మయోసైటిస్‌కు ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చింది. సమంత ఆధ్యాత్మిక వ్యక్తి అని, ఆమె తమిళనాడులోని పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేసిన సంగతి తెలిసిందే. 
 
తాజా నివేదిక ప్రకారం, సమంత దాదాపు 600 మెట్లు ఎక్కి, కర్పూరం వెలిగించి, తన బృందంతో కలిసి పళని మురుగన్ ఆలయాన్ని దర్శించుకుంది. సమంత రూత్ ప్రభు మెట్లు ఎక్కి కర్పూరం వెలిగిస్తున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. సమంత ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తులను ధరించింది.