శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 8 జులై 2019 (14:45 IST)

ఓ.. బేబి కోసం స‌మంత ఏం చేసిందో తెలుసా..?

ఇటీవల టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న అక్కినేని వారి కోడలు సమంత నటించిన కొత్త చిత్రం ఓబేబీ. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, ఆ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా సక్సెస్ సాధించింది. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు మరియు సినిమా ప్రముఖులు, చిత్రంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 
 
ఇక చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అని, అంతా తానై ఎంతో అద్భుతంగా నటించి, ఆమె ఈ చిత్రం ఇంత పెద్ద సక్సెస్ సాధించడంలో కీలక పాత్ర పోషించారని పొగడ్తలు కురిపిస్తున్నారు.
 
ఈ చిత్రాన్ని హైదరాబాద్ లోని దేవి థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చొని రహస్యంగా చూసి ఎంతో ఎంజాయ్ చేసానని సమంత తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఇక ప్రేక్షకుల కేరింతలు, హర్షద్వానాల మధ్య కూర్చుకుని చూసిన ఈ సందర్భం ఎప్పటికీ మరిచిపోలేనిదని, మేము ఎంతో కష్టపడి రూపొందించిన ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు తన పోస్ట్ ద్వారా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.