ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 మే 2023 (19:22 IST)

అల్లు అర్జున్‌నే వెనక్కి నెట్టింది.. ఆ జాబితాలో అగ్రస్థానంలో సమంత

Samantha with gold
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత పేరు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఎందుకంటే.. అమెరికన్ సిటాడెల్‌కు బాలీవుడ్ రూపం ఇస్తున్న సిటాడెల్‌లో ఆమె నటించడమే. అమెరికా వెబ్ సిరీస్‌ సిటాడెల్‌లో ప్రియాంక చోప్రా నటించగా.. బాలీవుడ్‌లో సమంత నటించింది. 
 
మయోసైటిస్‌ నుంచి కోలుకుంటూనే చేతిలో వున్న ప్రాజెక్టులను సక్సెస్‌ఫుల్‌గా ముగిస్తోంది సమంత. ఇలా వ్యక్తిగత, కెరీర్ పరంగా పలు సమస్యలను ధీటుగా ఎదుర్కొంటూ తనదైన రంగంలో రాణిస్తున్న  సమంతకు అరుదైన గౌరవం దక్కింది. మోస్ట్ పాప్యులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో సమంత నెంబర్ వన్‌గా నిలిచింది. 
 
ఇండియన్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) తాజాగా విడుదల చేసిన పాప్యులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో సమంత అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే టాప్ హీరోలు అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లను కూడా వెనక్కి నెట్టి సమంత అగ్రపీఠం అందుకుంది.