సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 22 జనవరి 2022 (16:42 IST)

సాకి గాళ్ ను మార్కెట్లోకి ప్ర‌వేశ‌పెట్టిన‌ స‌మంత ప్ర‌భు

Samantha Prabhu, Shruti Krishna
కొత్త ఏడాది సంక్రాంతి త‌ర్వాత న‌టి స‌మంత పిల్ల‌ల‌కోసం కొత్త దుస్తులను ప్రారంభించింది. `సాకి` అనేది స‌మంత ఓన్ బ్రాండ్‌. 2 సంవ‌త్స‌రాల నుంచి 8 సంవ‌త్స‌రాల పిల్ల‌ల‌కు ఆమె త‌యారుచేసిన ప్ర‌త్యేక దుస్తుల‌ను శ‌నివారంనాడు మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. 
 
భారతదేశ సాంప్రదాయ చేతిపనుల నుండి ప్రేరణ పొందిన ఆధునిక ఫ్యూజన్ దుస్తులు. ఇక్కత్ నుండి
దుస్తులు, సౌత్ కాటన్ వీవ్స్, ఎక్లెక్టిక్ ఫ్లోరల్ ప్రింట్స్ నుండి టైమ్‌లెస్ పోల్కా డాట్స్ మేకింగ్అ న్నీ ఉన్నాయి. ఇంత‌కుముందు స‌మంత చేనేత దుస్తుల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వుంది. దానికి సంబంధించిన చీర‌లు కూడా ఇందులో ఉన్నారు. ఆన్‌లైన్ లో ఇవి సాకీ పేరుతో దొరుకుతాయి. 
 
స‌మంత మాట్లాడుతూ, “మేము అన్ని వయసుల మహిళల కోసం బట్టలు తయారు చేసాం, ఇది విజయవంతమైంది. తల్లులందరూ తమ కుమార్తెలకు కూడా మమ్మల్ని బట్టలు అడిగారు! కాబట్టి, మేము మా చిన్న కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఏదో పని చేయడం ప్రారంభించాం.  యువ సాకీ అభిమానులందరికీ సాకి గర్ల్‌ని ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నాము అన్నారు.
 
సాకి కో-ఫౌండ‌ర్ శృతి కృష్ణ మాట్లాడుతూ, మా కొనుగోలుదారులు 18నుంచి 40 ఏజ్ వున్న మ‌హిళ‌లు ఎక్కువ‌గా వున్నారు. వారంతా పిల్ల‌ల‌కోసం మంచి డిజైన్‌లు చేయ‌మ‌ని స‌ల‌హా ఇవ్వ‌డంతో 2నుంచి 8 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న పిల్ల‌ల‌కోసం ప్ర‌త్యేక దుస్తులు త‌యారుచేశామ‌ని తెలిపారు.