1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 అక్టోబరు 2015 (12:24 IST)

నిత్యామీనన్‌కే ట్యాలెంట్-ఎనర్జీ-స్కిల్ ఎక్కువ: ఒప్పేసుకున్న సమంత

నిత్యామీనన్‌పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. తోటి హీరోయిన్ అయినప్పటికీ ఈగోలను పక్కనబెట్టి ప్రశంసల వర్షం కురిపించింది. సినిమా ఇండస్ట్రీలో ట్యాలెంట్-ఎనర్జీ-స్కిల్ ఉన్న ఓ హీరోయిన్ పేరు చెప్పమంటే సమంత టక్కున నిత్యామీనన్ అనే పేరు చెప్పేసింది.  తోటి హీరోయిన్ అందులోనూ పోటీ నిలిచే ప్రతిభావంతురాలైనా.. ఇంత నేరుగా ఒప్పేసుకోవడం సమంతకే చెల్లింది.
 
ఇదిలా ఉంటే.. సమంత, సిద్ధార్థ్‌ల మధ్య ప్రేమాయణం బ్రేకప్ అయిన తరుణంలో సమంత, సిద్ధూ ట్విట్టర్లో తమ సినిమాలపై ఒకరికొకరు కామెంట్స్ చేసుకోవట్లేదు. గతంలో సిద్ధార్థ్ సినిమాల్ని ప్రమోట్ చేసే సమంత బ్రేకప్‌కి తర్వాత అస్సలు పట్టించుకోవట్లేదు. సిద్ధార్థ్ కూడా సమంత బాటలోనే కామ్‌గా ఉండిపోతున్నాడు. 
 
బాహుబలి, తని ఒరువన్, నాన్ రౌడీ థాన్ సినిమాల గురించి పొగుడుతూ ట్వీట్ చేసిన సిద్ధార్థ్... దసరాకు రిలీజ్ అయిన సమంత 10 ఎండ్రదుకుల్ల సినిమా గురించి ఏం మాట్లాడ్లేదు. సినిమాలో డ్యుయల్ రోల్ చేసిన అమ్మడి నటనకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. సమంత మాత్రం సిద్ధూ సినిమా ఏదోచ్చినా అది ఎలా ఉన్నా దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసేది. మరి సిద్ధార్థ్ మాత్రం అలా ఎందుకు చేయట్లేదో..?