బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 అక్టోబరు 2024 (11:04 IST)

రానా లాంటి అన్నయ్య ప్రతి అమ్మాయికి కావాలి.. సమంత

Samantha
Samantha
హైదరాబాద్‌లో జరిగిన జిగ్రా అనే ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్‌గా హాజరయ్యారు సమంత. త్రివిక్రమ్ శ్రీనివాస్, దగ్గుబాటి రానా సైతం వచ్చారు. ఈ క్రమంలో రాణాను సమంతా పొగుడుతూ కామెంట్లు చేశారు. రానా లాంటి అన్నయ్య ప్రస్తుతం ప్రతి అమ్మాయికి కావాలని అన్నారు. 
 
రానా నాకు అన్నయ్య అని.. గత నెలలో.. ఒక ఫిమెల్ లీడ్ సినిమా చేశారు. ఇప్పుడు మరోసారి.. ఫిమెల్ లీడ్ మూవీ ప్రజెంట్ చేస్తున్నారు. అందుకు ఆయన లాంటి అన్నయ్య అందరికి దొరకాలని అన్నారు. అంతేకాకుండా.. ఇదే వేడుకలో హాజరైన త్రివిక్రమ్ సైతం.. సమంతాపై ప్రశంసలు కురిపించారు.
 
అదే విధంగా సమంతా.. కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాలే చేస్తున్నారన్నారు. ముంబైలోని ఎక్కువగా ఉంటున్నారని, ఆమె అభిమానులు నిరాశ పడుతున్నారన్నారు. ఆమె హెల్త్ అప్ డేట్ పైన కూడా అభిమానులు కాస్తంతా ఆందోళన చెందుతున్నారన్నారు.