గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (20:44 IST)

ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు గేమ్ షోకు సమంత?

యంగ్ టైగర్ హోస్ట్ చేస్తున్న ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు గేమ్ షో టాప్ టీఆర్ఫీతో దూసుకుపోతుంది. ఈ గేమ్ షో మొదటి ఎపిసోడ్‌‌‌లో గెస్ట్‌గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత టాప్ డైరెక్టర్స్ కొరటాల శివ, దర్శక ధీరుడు రాజమౌళి హాజరయ్యారు. 
 
ఈ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు గేమ్ షోకు రానున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ షోకు ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరో కాదు.. ఇటీవల విడాకులు తీసుకున్న సమంత. 
 
ప్ర‌స్తుతం ఈ ప్ర‌త్యేక‌మైన ఎపిసోడ్ షూటింగ్‌లో సమంత పాల్గొంటుంద‌ట‌. ఇక ఈ స్పెష‌ల్ ఎపిసోడ్ ఈ నెల చివ‌ర‌లో కానీ.. వ‌చ్చే నెల ప్రారంభంలో కాని టెలికాస్ట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు.