గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2022 (16:59 IST)

సమంత "యశోద" లుక్ రిలీజ్ - 9న టీజర్ రిలీజ్

yashoda look
హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం "యశోద". తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. హరి, హరీశ్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోకి అనువాదం చేసి రిలీజ్ చేయనున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ను మేకర్స్ ఇచ్చారు. 
 
సెప్టెంబరు 9వ తేదీన సాయంత్రం 5.49 గంటలకు ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. పనిలో పనిగా చవితి శుభాకాంక్షలతో ఓ కొత్త పోస్టరును కూడా రిలీజ్ చేసింది. "చుట్టూ అమ్మాయిలు, మహిళలు ఉండగా, వారి మధ్యలో ఉన్న సమంత సీరియస్‌ లుక్‌లో కనిపిస్తున్న" కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేయగా, ఇది ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మలు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించారు.