శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (15:01 IST)

సమంత మెడలో పసుపు తాడు, నల్లపూసలు.. రెండో పెళ్లి చేసుకుందా?

Samantha, Vijay Deverakonda
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మెడలో పసుపు తాడు కనిపించింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో సామ్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సమంత ఈ పిక్‏లో పసుపుతాడు, నల్లపూసలతో దర్శనమిచ్చింది. దీంతో సమంత రెండో పెళ్లి చేసుకుందన్న వార్తలు గుప్పుమన్నాయి. 
 
ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బాలీవుడ్, టాలీవుడ్‏లో బిజీ స్టార్‏గా మారింది సమంత. రీసెంట్‏గా హిందీలో వస్తున్న సీటాడెల్‏లో సమంత ప్రధాన పాత్రలో కనిపిస్తోంది. 
 
ఈ వెబ్ సీరీస్ షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా గడుపుతోంది. సీటాడెల్‏తో పాటు టాలీవుడ్‏లో విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ఖుషీ సినిమా షూటింగ్‏లోనూ పాల్గొంటోంది. ఈ షూటింగ్ కోసమే సామ్ పెళ్లి కూతురిలాగా ముస్తాబైందని తెలుస్తోంది.