ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 8 జులై 2019 (12:55 IST)

సమీరా రెడ్డి.. నిండు గర్భంతో కూడిన పొట్టను ఇలా చూపెట్టడం అవసరమా? (ఫోటోలు వైరల్)

సోషల్ మీడియా పుణ్యంతో సెలెబ్రిటీలు గ్లామర్ పంట పండిస్తున్నారు. మరోవైపు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను సైతం ఫ్యాన్స్ కోసం పోస్టులు చేస్తున్నారు. తాజాగా సమీరారెడ్డి నిండు గర్భంతో ఈత కొలనులో కడుపును చూపెడుతూ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ ఫోటోలు కాస్త వైరలై కూర్చున్నాయి. 
 
సాధారణంగా సెలబ్రిటీలు బేబీ బంప్ పేరిట నిండు గర్భంతో ఫోటో సెషన్లు తీయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. తాజాగా బాలీవుడ్‌లో సమీరా రెడ్డి అండర్ వాటర్ బేబీ జంప్ ఫోటోలతో అదరగొడితే, అటు హాలివుడ్ లో సైతం పలువురు సెలబ్రిటీలు బేబీ జంప్ ఫోటోలతో అభిమానులకు వెరైటీగా కనువిందు చేస్తున్నారు. 
 
సమీరా రెడ్డి నిండు గర్భంతో ఈత కొలను తీసుకున్న ఫోటోలు ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నాయి. కానీ విమర్శలు కూడా వస్తున్నాయి. నిండు కడుపుతో పొట్టను చూపెడుతూ ఇలా ఈత కొలనులో ఫోటో సెషన్ అవసరమా అంటూ మండిపడుతున్నారు. అమ్మతనానికి నిదర్శనమైన గర్భంతో కూడిన పొట్టను అందరికీ చూపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. 
 
ఇక తన ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎప్పటికప్పుడు నెటిజన్లకు టచ్‌లో ఉండే సమీరారెడ్డి.. 9 నెలల నిండు గర్భిణిగా బికినీతో నీటి అడుగున ఫొటో షూట్ నిర్వహించి సంచలనం సృష్టించింది.

ఇకపోతే.. నరసింహుడు, జై చిరంజీవ, అశోక్ తదితర తెలుగు చిత్రాల్లో నటించిన సమీరా రెడ్డి.. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమీరారెడ్డి అక్షయ్ వర్దే అనే బిజినెస్ మ్యాన్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కొడుకు ఉండగా.. రెండోసారి గర్భం దాల్చింది సమీరారెడ్డి.