సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (19:49 IST)

పవన్ రీట్వీట్... అన్నా, ఫోటో ఫ్రేమ్ కట్టించుకుంటా.. (Video)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పుట్టిన రోజు వేడుకలను సెప్టెంబరు రెండో తేదీన జరుపుకున్నారు. ఈ సందర్భంగా అనేక మంది సినీ సెలెబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, నిర్మాణ సంస్థలు, రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటివారిలో టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు ఒకరు. 
 
తెలుగు వెండితెరకు 'హృదయ కాలేయం' చిత్రం ద్వారా పరిచయమయ్యాడు. ఎలాంటి సపోర్టు లేకుండా స్వయంకృషితో హీరో అయ్యాడు. అందుకే అతన్ని ప్రతి ఒక్కరూ ముద్దుగా సంపూ అని పిలుస్తుంటారు. తన చిత్రం 'హృదయ కాలేయం' చిత్రంతో సంపూ రేపిన కలకలం అంతాఇంతా కాదు. ఆ సంపూ.. చెప్పిన పుట్టినరోజు శుభాకాంక్షలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఎంతో వినమ్రంగా రిప్లై ఇచ్చారు. 
 
'ప్రియమైన సంపూర్ణేశ్‌గారు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను' అంటూ స్పందించారు. పవన్ అంతటివాడు తన ట్వీట్‌కు బదులివ్వడంతో సంపూ ఆనందం అంబరాన్నంటుతోంది. పవన్ రిప్లై ట్వీట్ చూడగానే ఉబ్బితబ్బిబ్బులైపోయాడు. "అన్నా... మీ దగ్గర నుంచి ఈ రిప్లై రావడం ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. దీన్ని ఫొటో ఫ్రేమ్ కట్టించుకుంటాను" అంటూ తన హర్షం వెలిబుచ్చాడు.