మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (16:17 IST)

'తిక్క లేచింది.. లెక్కలు తెలిపోతాయ్' : సందీప్ కిషన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తల్లిపై అసభ్యకర దూషించిన సినీ నటి శ్రీరెడ్డి, ఆమె వెనుక ఉన్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు వ్యతిరేకంగా మెగా ఫ్యామిలీ ఏకమైంది. శ్రీరెడ్డి.. పవన్ తల్లిని ఉద్దేశించి అసభ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తల్లిపై అసభ్యకర దూషించిన సినీ నటి శ్రీరెడ్డి, ఆమె వెనుక ఉన్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు వ్యతిరేకంగా మెగా ఫ్యామిలీ ఏకమైంది. శ్రీరెడ్డి.. పవన్ తల్లిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడటంపై ఒక్కసారిగా పవన్ అభిమానులు భగ్గుమన్నారు. ఎన్నడూ లేనిది పవన్ వరుస ట్వీట్స్‌ పెట్టారు. తనపై జరుగుతున్న కుట్రలకు న్యాయపోరాటం చేయాలని భావించారు. ముఖ్యంగా, పవన్ కల్యాణ్‌కు బాసటగా సినీ నటులంతా ఏకమవుతున్నారు.
 
ఇందులో‌భాగంగా శుక్రవారం ఉదయం ఫిలించాంబర్‌లో న్యాయవాదులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పవన్‌కు మద్దతుగా మెగా కుటుంబం కూడా తరలి వచ్చింది. అయితే తాజాగా పవన్‌కు మద్దతుగా హీరో సందీప్ కిషన్ ట్వీట్ చేశాడు. 'తిక్క లేచిందని.. లెక్కలు తేలిపోతాయ్' అంటూ ట్వీట్ చేశారు. "పవర్ స్టార్.. నేను ఈయనకు చాలా పెద్ద అభిమానిని కానీ చూడలేకపోయాను. తిక్క లేచింది. లెక్కలు తేలిపోతాయి" అంటూ యువ హీరో సందీప్ కిషన్ ట్వీట్ చేశారు.